తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'దబాంగ్'​ తొలి ఎంపిక సల్మాన్​ కాదంట..! - సోనాక్షి సిన్హా

బాలీవుడ్​ కండల వీరుడు సల్మాన్​ఖాన్​ నటించిన 'దబాంగ్'​ సిరీస్​ సూపర్​ హిట్​ అయింది. అందులో 'చుల్​బుల్​ పాండే' పాత్రకు అభిమానులు ఫిదా అయిపోయారు. అతడి కెరీర్​లోనే ఓ మంచి పాత్రగా ముద్రపడింది. ఇంత పేరు తెచ్చిన ఈ సినిమా కోసం మొదట సల్మాన్​ను అనుకోలేదట.

'దబాంగ్'​ తొలి ఎంపిక సల్మాన్​ కాదంట..!

By

Published : Jul 24, 2019, 3:27 PM IST

Updated : Jul 24, 2019, 6:13 PM IST

బాలీవుడ్​లో సల్మాన్​ఖాన్​ హీరోగా వచ్చిన 'దబాంగ్' అన్ని వర్గాల వారిని విపరీతంగా ఆకట్టుకుంది. రెండు భాగాలు బాక్సాఫీస్​ వద్ద కాసుల వర్షం కురిపించాయి. ఇందులోని సల్మాన్ పాత్ర 'చుల్​బుల్​ పాండే'​ ఓ మరపురానిదిగా ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. ప్రస్తుతం మూడో భాగంలో నటిస్తూ బిజీగా ఉన్నాడు సల్మాన్. ఇలాంటి సమయంలో అతడి సోదరుడు అర్భాజ్​ ఖాన్​ ఓ ఆశ్చర్యకర విషయాన్ని బయటపెట్టాడు. దర్శకుడు అభినవ్​ ఈ పాత్ర కోసం మొదటి ఎంపిక సల్మాన్​ కాదని, నటులు ఇర్ఫాన్​ ఖాన్​, రణ్​దీప్​ హుడాలను అనుకున్నామని వెల్లడించాడు.

ఇర్ఫాన్​, అర్భాజ్​, రణ్​దీప్​

" చుల్​బుల్ పాండే పాత్ర కోసం రణ్​దీప్​, ఇర్ఫాన్​లను అనుకున్నాడు దర్శకుడు అభినవ్​. అయితే వారిద్దరినీ ఎంపిక చేయలేదు. నేను ఆ చిత్రాన్ని నిర్మిస్తానని ముందుకొచ్చినపుడు సల్మాన్​ ప్రస్తావన తీసుకొచ్చాడు. చుల్​బుల్​ పాండే పాత్రలో భాయ్​ నటిస్తే ఎలా ఉంటుందని అడిగాడు. చివరికి అన్ని అనుకున్నట్లే జరిగాయి " .

- అర్భాజ్​ఖాన్​, బాలీవుడ్​ నిర్మాత

2010లో విడుదలైన 'దబాంగ్'​ తొలి భాగం విపరీతమైన ఆదరణ పొందింది. 2012లో సీక్వెల్​ తీశారు. మూడో భాగం ప్రస్తుతం​ షూటింగ్ దశలో ఉంది. ప్రభుదేవా దర్శకుడు. పుణెలోని పల్టన్​లో 10 రోజుల షెడ్యూల్​ జరుపుకుంటోంది. సోనాక్షి సిన్హా మరోసారి భాయ్​కు జోడీగా నటిస్తోంది. అర్భాజ్​, కిచ్చా సుదీప్​, మహీ గిల్, మహేశ్​ మంజ్రేకర్​ కూతురు సైయీ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే 60 శాతం షూటింగ్​ పూర్తిచేసుకోగా... 2019 క్రిస్మస్​ కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

సల్మాన్​, సోనాక్షి జోడీ
Last Updated : Jul 24, 2019, 6:13 PM IST

ABOUT THE AUTHOR

...view details