టైమ్ నేపథ్యంతో అనేక ప్రయోగ చిత్రాలు చేస్తూ హాలీవుడ్‌తో పాటు అంతర్జాతీయంగా తనదైన ముద్ర వేసిన దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్. ఆయన చిత్రాలకు ప్రత్యేకంగా అభిమానులు ఉంటారనడంలో సందేహం లేదు. ఇందుకు 'ఇన్‌సెప్షన్', 'ఇంటర్‌స్టెల్లార్' వంటి ప్రయోగాత్మక చిత్రాలే కారణం. ఇటీవల కాలంలో ఆయన నుంచి వచ్చిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ 'టెనెట్'.
ఓటీటీ విడుదలకు 'టెనెట్' సిద్ధం - క్రిస్టోఫర్ నోలన్ వార్తలు
ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన 'టెనెట్' చిత్రం.. గతేడాది డిసెంబరు 4న థియేటర్లలో విడుదలై మంచి టాక్‌ను తెచ్చుకుంది. ఇప్పుడీ సినిమా ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో రానుంది.
'టెనెట్' ఓటీటీ విడుదల
కరోనా కారణంగా ఆలస్యంగా విడుదలైనా మంచి టాక్‌ను తెచ్చుకుంది. భారత్‌లో డిసెంబరు 4న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. మార్చి 31వ తేదీ నుంచి ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులోకి రానుంది.
ఇదీ చూడండి:'అవతార్' ఖాతాలో మరో రికార్డు