తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'టెనెట్' విడుదల రెండోసారి వాయిదా - nolan with jhon dawid washington

కరోనా ప్రభావం ఇంకా తగ్గకపోవడం వల్ల 'టెనెట్' సినిమాను మళ్లీ వాయిదా వేశారు. ఆగస్టు రెండోవారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

'టెనెట్' విడుదల రెండోసారి వాయిదా
'టెనెట్' సినిమా

By

Published : Jun 26, 2020, 12:41 PM IST

హాలీవుడ్​ ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తీసిన 'టెనెట్' విడుదల మరోసారి వాయిదా పడింది. కరోనా ప్రభావం ఇంకా తగ్గకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ పేర్కొంది.

దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్​తో జాన్ డేవిడ్ వాషింగ్టన్

ఇంతకు ముందు జులై 17 నుంచి జులై 31కి వాయిదా పడగా, ఇప్పుడు ఆ విడుదల తేదీ కాస్త ఆగస్టు 12కి మారింది. ఈ చిత్రాన్ని భారతదేశంలోని కొన్ని ప్రాంతీయ భాషల్లోనూ అభిమానుల ముందుకు తీసుకురానున్నారు.

టైమ్ ఇన్వర్షన్ అనే వినూత్న కథాంశంతో ఈ సినిమాను తీశారు. జాన్ డేవిడ్ వాషింగ్టన్, రాబర్ట్ పాటిన్సన్, డింపుల్ కపాడియా, మైకేల్ కెయిన్, ఎలిజిబెత్ డెబికి ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ అంచనాల్ని పెంచుతోంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details