హాలీవుడ్‌లోని ప్రసిద్ధ దర్శకుల్లో క్రిస్టోఫర్ నోలన్ ఒకరు. ఆయన సినిమా అంటే ప్రపంచంలోని సినీ అభిమానులు అందరూ ఎదురు చూస్తుంటారు. ప్రాణాంతక కరోనా ప్రభావం, ఇప్పుడు నోలన్ తెరకెక్కించిన 'టెనెట్'పైనా పడింది. దీంతో జులై 17న రావాల్సి ఉన్నా ఈ చిత్రాన్ని, రెండు వారాలు వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ వెల్లడించింది. అంటే జులై 31న థియేటర్లలోకి రానుంది.
నోలన్ 'టెనెట్' విడుదలపైనా కరోనా దెబ్బ - TENET CINEMA POSTER
ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ 'టెనెట్' సినిమా విడుదలపైనా కరోనా ప్రభావం పడింది. దీంతో విడుదలను రెండు వారాలు వాయిదా వేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు.
టెనెట్ సినిమా
టైమ్ ఇన్వర్షన్ అనే వినూత్న కథాంశంతో ఈ సినిమాను తీశారు. ఇందులో జాన్ డేవిడ్ వాషింగ్టన్, రాబర్ట్ పాటిన్సన్, డింపుల్ కపాడియా, మైకేల్ కెయిన్, ఎలిజిబెత్ డెబికి ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే వచ్చిన ట్రైలర్.. అంచనాల్ని పెంచుతోంది.
ఇవీ చదవండి: