క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన సైన్స్ ఫిక్షన్ చిత్రం 'టెనెట్'. కరోనా సమయంలో థియేటర్లలో రిలీజ్ అవుతోన్న భారీ బడ్జెట్ హాలీవుడ్ సినిమా కూడా ఇదే కావడం విశేషం. ఇప్పటికే పలు దేశాల్లో విడుదలైన ఈ చిత్రం భారత ప్రేక్షకుల్ని పలకరించబోతుంది. శుక్రవారం (డిసెంబర్ 4) ఇక్కడి థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు నోలన్ భారత అభిమానులకు ఓ సందేశం ఇచ్చారు.
"హాయ్.. నేను 'టెనెట్' చిత్ర దర్శకుడైన మీ క్రిస్టోఫర్ నోలన్. భారతీయ అభిమానులకు ఓ విషయం చెప్పదలుచుకున్నా. మీరు రేపు 'టెనెట్' సినిమా చూడబోతున్నారు. మీకు ఈ అవకాశం రావటం పట్ల నాకు చాలా ఉత్కంఠగా ఉంది. ఈ సినిమా షూటింగ్ ముంబయిలోనూ జరిగింది. బాలీవుడ్ నటి డింపుల్ కపాడియాతో పని చేయడం ఆనందం కలిగించింది. 'టెనెట్' బిగ్ స్క్రీన్‌పై విడుదల కాబోతుంది. సినిమా చూసి ఆనందించండి. మీకు కృతజ్ఞతలు."