ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో 'చౌకీదార్' అనే పదం బాగా ఉపయోగించి ప్రజలను ఆకట్టుకున్నారు. అపూర్వమైన విజయం సాధించిన తర్వాత మోదీ, పార్టీనాయకులు చౌకీదార్ అనే పదం ట్విట్టర్ నుంచి తొలగించారు.
మోదీ ప్రచార పదం 'చౌకీదార్'తో కన్నడ చిత్రం - దర్శకుడు చంద్రశేఖర్ బండియప్ప
ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికలలో చౌకీదార్ పదం విస్తృతంగా వాడింది భారతీయ జనతా పార్టీ. ఈ పేరుతోనే ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా ప్రచారం చేశారు. ఇంతగా ప్రజల్లోకి వెళ్లిన టైటిల్‌తో సినిమా వస్తోంది.

ప్రస్తుతం ఈ పదం మళ్లీ కన్నడ నాట వినిపిస్తోంది. ఈ టైటిల్‌తో కన్నడలో ఓ సినిమా నిర్మించేందుకు సిద్ధమయ్యారు దర్శకుడు చంద్రశేఖర్ బండియప్ప.
తారకాసుర, రథావర చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు చంద్రశేఖర్... తాజాగా చౌకిదార్ పేరుతో సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఈ పేరును కన్నడ ఫిల్మ్‌ఛాంబర్‌లో నమోదు చేసుకున్నారు. ఈ సినిమా ఆగస్టులో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. ప్రధాని మోదీ గురించిన విశేషాలతో సినిమా నేపథ్యం ఉంటుందని పేర్కొన్నారు దర్శకుడు చంద్రశేఖర్. ఇందులో గోల్డెన్ స్టార్ గణేష్ నటించే అవకాశం ఉంది. నిర్మాత, హీరోయిన్ ఎవరనేది త్వరలోనే వెల్లడించనున్నారు.