విలక్షణ నటనతో అలరించే కథానాయకుడు విక్రమ్. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ హీరోకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. కథ నచ్చాలే కానీ ఎలాంటి సాహసం చేయడానికైనా సిద్ధపడతాడు చియాన్ విక్రమ్. త్వరలో 'మిస్టర్ కె.కె'తో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు.
"కీన్ రీవ్స్ హీరోగా నటించిన ఓ హిట్ చిత్రంలో నాకు అవకాశమిచ్చారు. కానీ, ఆ పాత్ర నాకు సరిపడదనే ఉద్దేశంతో వద్దన్నా. ఆ తర్వాత ‘ద గ్రేట్ గాట్స్ బై’లో ఓ పాత్ర కోసం నన్ను సంప్రదించారు. అది నా ఇమేజ్‌కు సరిపోదనిపించింది. కేవలం భారత్‌లో మార్కెట్ పెంచుకోవాలనే ఉద్దేశంతోనే ఇక్కడి నటులకు అవకాశం ఇచ్చేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు హాలీవుడ్ మేకర్స్. ఆ పాత్రలకు సినిమాలో గుర్తింపు అంతంత మాత్రంగానే ఉంటోంది. అందుకే అలాంటి చిత్రాల్లో అవకాశమొస్తే పాత్రల ఎంపికలో జాగ్రత్త వహించడం ఎంతో అవసరం" -చియాన్ విక్రమ్, హీరో