కోలీవుడ్ హీరో విక్రమ్.. ప్రస్తుతం 'కోబ్రా'లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో దాదాపు 25 పాత్రల్లో కనువిందు చేయనున్నాడు. ఫస్ట్‌లుక్ నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇందులో ఏడు వేషధారణల్లో కనిపించి అంచనాల్ని పెంచుతున్నాడీ నటుడు.
'కోబ్రా' కోసం విక్రమ్ ఇన్ని గెటప్పుల్లోనా? - entertainment news
విక్రమ్ 'కోబ్రా' చిత్ర ఫస్ట్‌లుక్ అలరిస్తోంది. ఇందులో దాదాపు 25కు పైగా గెటప్పుల్లో కనిపించనున్నాడీ హీరో. మేలో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
కోబ్రా సినిమా ఫస్ట్‌లుక్
గత కొంతకాలంగా హిట్లు లేక సతమతమవుతున్నాడు విక్రమ్. 'ఐ' తర్వాత చేసిన 'ఇంకొక్కడు', 'సామి స్క్వేర్' చిత్రాలు నిరాశపరిచాయి. అందుకే 'కోబ్రా'తో ఎలాగైనా సరే హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. ఈ చిత్రానికి అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్నాడు. ఎస్.ఎస్. లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు. మేలో థియేటర్లలోకి రానుందీ సినిమా.
Last Updated : Mar 2, 2020, 9:18 PM IST