తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'మాస్టర్​'​ వీడియో సాంగ్.. 'జాంబీరెడ్డి'​ థీమ్​సాంగ్​ - ఇచ్చట వాహనాలు నిలుపరాదు టీజర్​

టాలీవుడ్​లోని కొత్త ప్రాజెక్టుల కబుర్లు వచ్చేశాయి. ఇందులో 'నారింజ మిఠాయి' సినిమా రిలీజ్​ డేట్, 'మాస్టర్​' వీడియో సాంగ్​​ సహా పలు చిత్రాల టీజర్​, ట్రైలర్​ అప్​డేట్స్​ ఉన్నాయి.

chitti story video song released.. zombie reddy theme song
'మాస్టర్​'​ వీడియో సాంగ్.. 'జాంబీరెడ్డి'​ థీమ్​సాంగ్​

By

Published : Jan 27, 2021, 9:05 PM IST

  • సముద్రఖని, సునయన, మణికందన్‌, కె.నివేదితా సతీశ్‌ తదితరులు కీలక పాత్రల్లో హలిత షమీమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'సిల్లు కరుప్పత్తి'. 2019 డిసెంబరులో విడుదలైన ఈ సినిమా అక్కడ బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని సాధించింది. అంతేకాదు, బెంగళూరు ఇంటర్నేషన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌, టొరంటో తమిళ్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో దీన్ని ప్రదర్శించారు. అయితే ఈ సినిమాను తెలుగులో ప్రముఖ ఓటీటీ 'ఆహా' వేదికగా 'నారింజ మిఠాయి' పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. జనవరి 29వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా చిత్ర టీజర్‌ను విడుదల చేశారు.
  • దళపతి విజయ్​ కొత్త చిత్రం 'మాస్టర్​' నుంచి 'చిట్టీ స్టోరీ' వీడియో సాంగ్​ను చిత్రబృందం బుధవారం విడుదల చేసింది.
  • యువ కథానాయకుడు సుశాంత్​ హీరోగా నటిస్తోన్న కొత్త చిత్రం 'ఇచ్చట వాహనాలు నిలుపరాదు'. ఈ సినిమా టీజర్​ను జనవరి 29న యంగ్​ రెబల్​స్టార్ ప్రభాస్​ విడుదల చేయనున్నారు.
  • ప్రముఖ వ్యాఖ్యాత అనసూయ, విరాజ్ అశ్విన్​ కలిసి నటిస్తోన్న చిత్రం 'థ్యాంక్యూ బ్రదర్​'. ఈ సినిమా ట్రైలర్​ను జనవరి 28న సాయంత్రం 4.05 గంటలకు విక్టరీ వెంకటేశ్ విడుదల చేయనున్నారు.
    'థ్యాంక్యూ బ్రదర్' ట్రైలర్​ రిలీజ్​ పోస్టర్​
  • 'జాంబీ రెడ్డి' చిత్రంలోని థీమ్ సాంగ్​ను బుధవారం చిత్రబృందం విడుదల చేసింది. ఈ సినిమా ద్వారా తేజ సజ్జా హీరోగా పరిచయమవుతున్నారు.
  • 'డబ్ల్యూడబ్లూడబ్ల్యూ' చిత్రంలోని మెలోడీ సాంగ్​ను జనవరి 28న ఉదయం 10.06 గంటలకు హీరోయిన్​ తమన్నా చేతులమీదుగా విడుదల చేయనున్నారు.
    'డబ్ల్యూడబ్లూడబ్ల్యూ' సినిమా మెలోడీ సాంగ్ రిలీజ్​ పోస్టర్​

ABOUT THE AUTHOR

...view details