తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపిన 'చిత్రలహరి' బృందం

సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'చిత్రలహరి' విడుదలై నేటికి (ఏప్రిల్ 12) సరిగ్గా ఏడాది. ఈ సందర్భంగా ఈ సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది చిత్రబృందం.

సాయి
సాయి

By

Published : Apr 12, 2020, 4:15 PM IST

సాయిధరమ్ తేజ్ హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'చిత్రలహరి'. ఈ చిత్రం విడుదలై నేటికి సరిగ్గా ఏడాదైన సందర్భంగా హీరో తేజ్, దర్శకుడు కిశోర్ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. 'సుప్రీమ్' తర్వాత సాయిధరమ్​ నటించిన పలు చిత్రాలకు మిశ్రమ స్పందనలు వచ్చాయి. ఆ సమయంలో విడుదలైన 'చిత్రలహరి' మంచి విజయాన్ని అందుకుంది. తేజ్​ కెరీర్​కి మరో హిట్​ని అందించింది.

"నా పేరు విజయ్‌ (చిత్రలహరి చిత్రంలో సాయిధరమ్‌ తేజ్‌ పాత్ర పేరు). నా పేరులో ఉన్న విజయం మీవల్లే నాకు లభించింది. నా కెరీర్‌లోనే ఎంతో అందమైన, ముఖ్యమైన చిత్రం విడుదలై నేటికి ఏడాది. మెగా అభిమానులు, సినీ ప్రియుల ప్రేమాభిమానాలకు నా ధన్యవాదాలు. ఈ విజయం నాది కాదు మీది. మీ విజయ్‌.." అని సాయిధరమ్‌ తేజ్‌ ట్వీట్‌ చేశాడు.

అలాగే దర్శకుడు కిశోర్ తిరుమల ఓ వీడియో ద్వారా చిత్రయూనిట్​కు, ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపాడు. "ఈ కథ ఎంచుకోవడానికి రెండు కారణాలున్నాయి. ఒకటి హీరో క్యారక్టరైజేషన్ (లూజర్) .రెండు ఏ కారణం లేకుండా ఎవరూ మన జీవితంలోకి రారు." అంటూ పలు విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.

ABOUT THE AUTHOR

...view details