తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'చిత్రలహరి'​లో సింపుల్​గా ధరమ్​తేజ్​ - చిత్రలహరి టీజర్

"చిత్రలహరి" టీజర్ ఆకట్టుకుంటోంది. ఐదు పాత్రల్ని పరిచయం చేస్తూ విడుదలైందీ టీజర్. ఇందులో సాయిధరమ్ తేజ్ సింపుల్​ లుక్​లో కనిపిస్తున్నాడు.

టీజర్ విడుదల కార్యక్రమంలో చిత్రబృందం

By

Published : Mar 13, 2019, 12:37 PM IST

టాలీవుడ్ యువ కథానాయకుడు సాయిధరమ్ తేజ్ హీరోగా వస్తోన్న సినిమా "చిత్రలహరి". దీనికి సంబంధించిన టీజర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. విజయాల్లేక సతమవుతున్న ఈ మెగా హీరో.. ఈ సినిమాపై భారీగానే ఆశలు పెట్టుకున్నాడు.


'చిత్రలహరి' అప్పట్లో దూరదర్శన్​లో ప్రతి శుక్రవారం వచ్చే ప్రోగ్రాం . 'ఈ చిత్రలహరి' 2019లో ఓ శుక్రవారం విడుదలయ్యే సినిమా... అంటూ సాగే డైలాగ్​తో టీజర్​ మొదలయింది.

నివేదా పేతురాజ్, కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సునీల్, వెన్నెల కిశోర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

'నేను శైలజ', 'ఉన్నది ఒకటే జిందగీ' చిత్రాలతో ఆకట్టుకున్న కిశోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్​పై తెరకెక్కిన ఈ సినిమా...వేసవి కానుకగా ఏప్రిల్ 12న విడుదలకు సిద్ధమవుతోంది.

ABOUT THE AUTHOR

...view details