సరైన హిట్లు లేక సతమతమవుతున్న టాలీవుడ్ హీరో సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం "చిత్రలహరి" సినిమాలో నటిస్తున్నాడు. దీని టీజర్ రేపు విడుదల కానుంది. ఈ చిత్రంపై భారీగానే ఆశలు పెట్టుకున్నాడీ మెగా హీరో. అధికారక పోస్టర్ను విడుదల చేస్తూ 13వ తేదీ ఉదయం 9 గంటలకు కలుస్తామని పేర్కొంది చిత్రబృందం.
"చిత్రలహరి" టీజర్ రేపే.. - SAI SHARAM TEJ
మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటిస్తున్న "చిత్రలహరి" సినిమా టీజర్ రేపు విడుదల కానుంది.
రేపు విడుదల కానున్న చిత్రలహరి టీజర్
కల్యాణి ప్రియదర్శన్, నివేథా పేతురాజ్ఈ చిత్రంలో హీరోయిన్లు. సునీల్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. "నేను శైలజ" ఫేం కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తుండగా దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ సినిమాను నిర్మించింది. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా వేసవి కానుకగా ఏప్రిల్ 12న రానుంది.