saipallavai sister movie: ప్రముఖ నటి, డ్యాన్సర్ సాయిపల్లవి చెల్లెలు పూజా కన్నన్ హీరోయిన్‌గా తెరంగేట్రం చేయనుంది! 'జీ5' ఓటీటీలో డిసెంబర్ 3న విడుదల కానున్న తమిళ చిత్రం 'చిత్తిరై సేవానమ్' ద్వారా ఆమె ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఇదే విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించింది . "చాలా కాలం నుంచి ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నా. డిసెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కొంచెం నెర్వస్‌గా ఉంది. సినిమాలో నా పాత్ర పోషించేటప్పుడు వరకూ ఎంత ఎంజాయ్ చేశానో...అదే రీతిలో మీరు నా నటనను ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నా. నన్ను ఆశీర్వదించండి" అంటూ ఆ సినిమా పోస్టర్‌ను విడుదల చేశారు.
శిల్వ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను అగ్రకథానాయకుడు ధనుష్ ట్విటర్‌లో విడుదల చేశారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఓ తండ్రీ కూతురి కథ అన్నట్లుగా మోషన్ పోస్టర్ ఆధారంగా తెలుస్తోంది. ఇందులో పూజకు తండ్రిగా ప్రముఖ నటుడు సముద్రఖని నటించారు. జీ తమిళ్, అమిర్తా, థింగ్ బిగ్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. సామ్ సీఎస్ స్వరాలు సమకూర్చారు.