హీరోయిన్ తమన్నా భాటియాలో ఓ కవయిత్రి దాగుందని తన ఇన్‌స్టాగ్రామ్ వాల్‌పై రాసుకున్నారు. ఈ క్రమంలో లాక్‌డౌన్ సమయంలో కొన్ని కవితలు రాసినట్లు వెల్లడించారు. చిన్నతనంలో కవితలు ఎక్కువగా రాసే వారని ఆమె చెప్పుకొచ్చారు.
"కొన్నిసార్లు కవయిత్రిని కూడా" అని మీ ఇన్‌స్టాగ్రామ్ వాల్‌పై రాసుకున్నారు. ఈ లాక్‌డౌన్ సమయంలో ఏమైనా కవితలు రాశారా?
తమన్నా:మనసుకు ఆహ్లాదంగా అనిపించినప్పుడల్లా కవితలు రాస్తుంటా. ఈ లాక్‌డౌన్ విరామంలోనూ కొన్ని కవితలు రాశా. దాని కన్నా ఎక్కువగా నా చిన్నతనంలో రాసుకున్న పాత కవితల్ని తిరిగి చదువుకుంటున్నా. కొన్నింటిని చదువుతుంటే.. ఆ సమయంలో ఎందుకిలా రాశా? ఇది కూడా కవితేనా? అని నవ్వొస్తుంది. మీకొక విషయం చెప్పనా చిన్నతనంలో నేనెక్కువగా డైరీలో రాసుకున్న మాటేంటో తెలుసా? "నేను చాలా అయోమయంలో ఉన్నా".
ఇదీ చూడండి... ఆది కొత్త సినిమాకు 'బ్లాక్' టైటిల్ ఖరారు