మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే దాదాపు చిత్రీకరణ పూర్తికాగా కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడింది. ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్ కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులను స్వస్తి చెబుతూ ఈ చిత్రం నుంచి ఎట్టకేలకు సర్ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధమైంది చిత్రబృందం.
చిరు అభిమానులకు శుభవార్త.. ఫస్ట్‌లుక్ వచ్చేస్తోంది! - చిరంజీవి పుట్టినరోజు
మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి సర్ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధమైంది చిత్రబృందం. చిరు పుట్టినరోజైన ఆగస్టు 22న ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
చిరు అభిమానులకు శుభవార్త.. ఫస్ట్‌లుక్ వస్తోంది!
చిరు పుట్టినరోజైన ఆగస్టు 22న ఈ సినిమా ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్‌ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. సాయంత్రం 4 గంటలకు ఈ సర్ప్రైజ్ విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రీలుక్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో చేతిలో ఎర్ర కండువాతో కనిపిస్తున్నాడు చిరు.
ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా చేస్తుండగా.. దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ ప్రత్యేక పాత్రలో కనిపిస్తాడని సమాచారం.