తెలుగుతెరపైమళ్లీ మెగాస్టార్ చిరంజీవి, విజయశాంతి కలిసి నటించనున్నారు. చివరిగా ఈ జంట 'మెకానిక్ అల్లుడు' చిత్రంలో కనిపించింది. ఆ తర్వాత వీరి కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కలేదు. కొంతకాలం తర్వాత విజయశాంతి రాజకీయాల్లో చేరడం వల్ల నటనకు దూరమైంది. చిరు కూడా పార్టీ స్థాపించి పొలిటికల్ ఎంట్రీతో సినిమాలకు విరామం ప్రకటించాడు. మళ్లీ ఈ స్టార్ నటీనటులు మేకప్ వేసుకొని ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.
26 ఏళ్ల తర్వాత మెగాస్టార్ జోడీగా విజయశాంతి.! - chiru vijaya shanthi movie
టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి, విజయశాంతి జోడీ హిట్ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. 90ల్లో వీరిద్దరూ కలిసి నటించిన దాదాపు అన్ని చిత్రాలు ఘన విజయాన్ని సాధించాయి. మరోసారి ఈ జోడీ వెండితెరపై అలరించనున్నట్లు సమాచారం.
26 ఏళ్ల తర్వాత మెగాస్టార్ జోడీగా విజయశాంతి.!
చిరుతో కొరటాల శివ ఓ సినిమా తెరకెక్కిస్తున్నారనే విషయం తెలిసిందే. ఇందులో విజయశాంతి ఓ కీలక పాత్రలో కనిపించనుందట. ఈ ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే ప్రత్యేకమని టాలీవుడ్ టాక్. ఇది ఖరారైతే 26 ఏళ్ల తర్వాత క్రేజీ జోడి మరోసారి ప్రేక్షకులకు కనువిందు చేసినట్టే. ప్రస్తుతం చిరు 'సైరా'తో, విజయశాంతి 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంతో బిజీగా ఉన్నారు.
Last Updated : Sep 28, 2019, 1:31 PM IST