కన్నడ నటి మేఘన రాజ్ త్వరలోనే సినిమాల్లో నటించనుందని తాజాగా ఓ ఇంటర్య్వూలో వెల్లడించింది. జూన్ 7న ఆమె భర్త చిరంజీవి సర్జా గుండె నొప్పితో మరణించారు. అప్పటి నుంచి ఆమె ఎంతో మనోధైర్యంతో ముందుకు సాగుతోంది.
"నటనంటే నాకెంతో ఇష్టం. అది నా రక్తంలోనే ఉంది. నా భర్త చిరంజీవి సర్జా, నాకు ఇష్టమైనదేదీ వదులుకోవద్దని, నటించమని చెప్పేవారు. అందుకే నేను ఉన్నంతవరకు సినిమాల్లో నటిస్తూనే ఉంటా. తప్పకుండా త్వరలోనే సినిమాల్లో తిరిగి నటిస్తా".