తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'చిరు ఆక్సిజన్ బ్యాంక్' సేవలు ప్రారంభం - చిరు ఆక్సిజన్ బ్యాంక్ సేవలు ప్రారంభం

ఇటీవలే ప్రకటించిన విధంగా కరోనా బాధితుల సహాయార్థం 'చిరు ఆక్సిజన్ బ్యాంక్​'లను గుంటూరు, అనంతపురం జిల్లా ప్రారంభించారు మెగాస్టార్ చిరంజీవి. గురువారం నుంచి ఖమ్మం, కరీంనగర్​తో పాటు మరో ఐదు జిల్లాల్లో సేవలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు.

Chiru Oxygen Bank
చిరు ఆక్సిజన్ బ్యాంక్

By

Published : May 26, 2021, 10:51 AM IST

'బ్లడ్‌బ్యాంక్‌', 'ఐబ్యాంక్‌' వేదికలుగా ఇంతకాలం ఎంతోమందికి సాయం అందించిన మెగాస్టార్‌ చిరంజీవి మరోసారి మాట నిలబెట్టుకున్నారు. కరోనా బారినపడి సమయానికి ఆక్సిజన్‌ అందక ప్రాణాలు కోల్పోతున్న వారి కోసం చెప్పినట్టుగానే 'చిరు ఆక్సిజన్‌ బ్యాంక్‌'లను ఆయన అందుబాటులోకి తీసుకువచ్చారు. తెలుగు రాష్ట్రాలోని చాలా జిల్లాల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయని ఆయన ఇటీవల తెలిపిన విషయం విదితమే. ఈ క్రమంలోనే తాజాగా బుధవారం ఉదయం అనంతపురం, గుంటూరు జిల్లాల్లో 'చిరు ఆక్సిజన్‌ బ్యాంక్‌' సేవలు ప్రారంభమయ్యాయి.

ఈ విషయం గురించి చిరు మాట్లాడుతూ.. "అనుకున్న ప్రకారం వారం రోజులలోపే వందలకొద్ది ఆక్సిజన్‌ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు సంపాదించాం. అనంతపురం, గుంటూరు జిల్లాల్లో బుధవారం నుంచి 'చిరు ఆక్సిజన్‌ బ్యాంక్‌' సేవలు ప్రారంభమవుతున్నాయి. గురువారం నుంచి ఖమ్మం, కరీంనగర్‌లతోపాటు మరో ఐదు జిల్లాల్లో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఆక్సిజన్‌ అందక ఎవరూ ఇబ్బందిపడకూడదు. ఇన్ని ఆక్సిజన్‌ సిలిండర్లు సంపాదించడానికి రామ్‌చరణ్‌ కూడా ఎంతో కృషి చేశాడు. నాకెంతో సంతోషంగా ఉంది" అని చిరు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details