తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఉగాది కానుకగా మెగాస్టార్​ సినిమా ఫస్ట్​లుక్​! - చిరు 152 మూవీ అప్​డేట్

మెగాస్టార్​ చిరంజీవి- కొరటాల శివ కాంబినేషన్​లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా టైటిల్​పై వస్తోన్న ప్రచారాలకు చెక్​ పెట్టబోతుంది చిత్రబృందం. ఉగాది కానుకగా ఆ విశేషాల్ని అభిమానులతో పంచుకోనున్నట్టు ప్రచారం జరుగుతోంది.

chiru-one-fifty-two-first-look-koratala-siva
ఉగాది కానుకగా మెగాస్టార్​ సినిమా ఫస్ట్​లుక్​!

By

Published : Mar 10, 2020, 6:30 AM IST

చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. త్రిష కథానాయిక. 'చిరు 152' వర్కింగ్‌ టైటిల్‌తో చిత్రీకరణ జరుగుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర అంశం బయటకు వచ్చింది. అదేంటంటే? ఎప్పుడెప్పుడా అని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను ఉగాది కానుకగా మార్చి 25న విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోందట. అదే రోజు టైటిల్‌ను అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది.

ఈ సినిమాకు 'ఆచార్య'ను పరిశీలిస్తున్నట్టు ఎప్పటి నుంచో వార్తలొస్తున్నాయి. ఇటీవలే ఓ చిత్ర వేడుకకు హాజరైన చిరు.. అదే పేరును సంబోధించడం వల్ల దీనిపై ఓ స్పష్టత ఏర్పడింది. మరి ఇదే టైటిల్‌తో వస్తారా అనే దానిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దేవాదాయ శాఖ నేపథ్యంలో సాగే కథ కావడం వల్ల ఈ సినిమాపై అందరిలో అంచనాలు పెరుగుతున్నాయి. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిచనున్నాడు.

ఇదీ చూడండి..'నేను ఏ మతాన్ని నమ్మను.. భారతీయుడిని అంతే'

ABOUT THE AUTHOR

...view details