మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. 'చిరు 152'వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. షూటింగ్‌లో భాగంగా ప్రస్తుతం చిరంజీవిపై పలు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన చిరంజీవి లుక్ ఒకటి నెట్టింట్లో లీకైంది.
చిరు-కొరటాల చిత్రం నుంచి మెగాస్టార్ లుక్ లీక్ - Chiranjeevi Koratala Siva new movie \
మెగాస్టార్ చిరంజీవి, త్రిష ప్రధానపాత్రల్లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. కొరటాల శివ దర్శకుడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోన్న ఈ సినిమా నుంచి మెగాస్టార్ లుక్ ఒకటి లీకైంది.
ఈ ఫొటోలో చిరు మెడలో ఎర్ర కండువా ధరించి మాస్ లుక్‌లో దర్శనమిచ్చాడు. ఈ లుక్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. చిరంజీవి లుక్ చూసిన అభిమానులు.. వివిధ సందర్భాల్లో మెగా హీరోలు ఎర్ర కండువాతో ఉన్న లుక్స్‌ను యాడ్ చేసి నెట్టింట్లో పలు ఫొటోలను పోస్ట్ చేస్తున్నారు.
'చిరు152'లో త్రిష హీరోయిన్. మణిశర్మ సంగీతమందిస్తున్నాడు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముందీ చిత్రం.