కరోనా వైరస్, లాక్‌డౌన్‌తో వచ్చిన ఖాళీ సమయాన్ని అగ్ర కథానాయకుడు చిరంజీవి ఆస్వాదిస్తున్నారు. ఇప్పటికే అనే వ్యాపకాలతో గడుపుతున్న ఆయన అభిమానులను షాక్‌కు గురి చేశారు. గురువారం ఇన్‌స్టా వేదికగా ఆయన పంచుకున్న ఫొటో చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. అభిమానులే కాదు, ఆయన తనయుడు రామ్‌చరణ్ కూడా 'నాన్న నేను చూస్తున్నది నిజమేనా' అంటూ సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు.
వైరల్: చిరు ఖతర్నాక్ లుక్.. సినిమా కోసమేనా? - మెగాస్టార్ వార్తలు
సామాజిక మాధ్యమాల్లో తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఓ ఫొటో పోస్ట్ చేశారు. స్టైలిష్ లుక్‌తో ఉన్న ఈ చిత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
సామాజిక మాధ్యమాల్లో చేరిన తర్వాత మెగాస్టార్ చిరంజీవీ తన పోస్టులతో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను నెట్టింట షేర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఫొటోను షేర్ చేశారు మెగాస్టార్. ఈ లుక్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇందులో గుండు, కళ్లజోడుతో స్టైలిష్ లుక్‌తో అదరగొట్టారు చిరు. దీనికి 'బాస్ ఈజ్ ఆల్వేస్ బాస్' అంటూ కామెంట్లు పెడుతున్నారు అభిమానులు. అయితే ఈ అవతారం ఊరికే ట్రై చేసిందా.. లేక సినిమాలో గెటప్ కోసమా అనే విషయంపై స్పష్టత లేదు. కానీ కొందరు మాత్రం ఇది సినిమా కోసమే అంటూ ఓ అభిప్రాయానికి వస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ చిరును ఇప్పటివరకు ఫ్యాన్స్ ఈ గెటప్‌లో చూడలేదు.