ఈ ఏడాది దసరాకు సినీ అభిమానులు పండగ చేసుకోబోతున్నారు. ఎందుకంటే అగ్రహీరోలైన మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ.. తమ కొత్త సినిమాలను అప్పుడే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారట. ఈ వార్త ప్రస్తుతం అంతటా చక్కర్లు కొడుతోంది. ఇది నిజమో కాదో? తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.
ఇప్పటికే చిరు-కొరటాల సినిమా షూటింగ్ జరుపుకుంటుండగా, బాలయ్య-బోయపాటి చిత్రం వచ్చే నెల నుంచి చిత్రీకరణ జరుపుకోనుంది. ఈ రెండు సినిమాల దర్శక నిర్మాతలు.. తమ ప్రాజెక్టులను దసరా బరిలోనే దించాలని భావిస్తున్నారు.