నటుడు, నిర్మాత నాగబాబు కొవిడ్-19 బారినపడ్డారు. ఇటీవల ఆయన కొవిడ్-19 పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా ఆయన ఇన్‌స్టా వేదికగా పోస్ట్ పెట్టారు.
మెగా బ్రదర్ నాగబాబుకు కరోనా పాజిటివ్ - నాగబాబు వార్తలు
కరోనా బారిన పడ్డ మెగా బ్రదర్ నాగబాబు.. త్వరలో దానిని జయించి, ప్లాస్మా దాతగా మారతానని అన్నారు.
Chiranjeevi's brother Naga Babu
"వ్యాధి వచ్చిందని బాధగా ఉండడం కాదు. దాని నుంచి కోలుకుని వేరొకరి సాయం చేయాలి. కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. సరైన జాగ్రత్తలు పాటించి.. కరోనాని జయించి.. ప్లాస్మా దాతగా మారతాను" -ఇన్‌స్టాలో నాగబాబు
నాగబాబు పోస్ట్‌పై అభిమానులు స్పందిస్తూ, ఆయన వెంటనే కోలుకోవాలంటూ కామెంట్లు పెడుతున్నారు. నటుడు కల్యాణ్‌దేవ్, 'నాగబాబు మామయ్య మీరు వేగంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను' అని రాసుకొచ్చారు.
Last Updated : Sep 16, 2020, 11:37 AM IST