మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్రబృందం భావిస్తోంది. త్వరితగతిన దానిని ముగించాలని చూస్తోంది. ఈ నేపథ్యంలోనే నవంబరు 20 నుంచి చిరు సెట్స్‌లో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది.
లాక్డౌన్ ప్రభావంతో మార్చి నుంచి 'ఆచార్య' చిత్రీకరణ నిలిచిపోయింది. ఇటీవలే తిరిగి ప్రారంభించారు. అప్పుడు చేసిన వైద్యపరీక్షల్లో చిరుకు కొవిడ్ పాజిటివ్‌గా తేలడం వల్ల ఆయన లేకుండానే సన్నివేశాల్ని తీస్తున్నారు. డాక్టర్ల పొరపాటు వల్లే ఆయనకు వైరస్ సోకినట్లు రిపోర్ట్ ఇచ్చారని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు.