తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఒకేసారి.. రెండు చిత్రాల్లో మెగాస్టార్ బిజీ - చిరంజీవి బాబీ దర్శకత్వంలో సినిమా

ఆచార్య సినిమా పూర్తవ్వడమే ఆలస్యం.. మరో రెండు ప్రాజెక్టులను ఒకేసారి పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇంతకీ ఆ సినిమాలేంటి? వాటి సంగతేంటి?

chiranjeevi movie news
చిరంజీవి

By

Published : Jul 29, 2021, 6:46 AM IST

ఒకపక్క 'ఆచార్య' పనులు కొనసాగుతుండగానే.. మరోవైపు 'లూసిఫర్‌' రీమేక్‌ కోసం ఏర్పాట్లు షురూ అయ్యాయి. వచ్చే నెల 13 నుంచే ఆ చిత్రం కోసం మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగుతారు. 'ఆచార్య' కోసం ఎక్కువ సమయమే తీసుకున్న ఆయన.. ఇకపై మాత్రం వేగం పెంచాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. 'లూసిఫర్‌' రీమేక్‌తోపాటు.. బాబీ దర్శకత్వం వహించనున్న సినిమానూ సమాంతరంగా చేయాలని ఆయన నిర్ణయించినట్టు తెలిసింది.

అక్టోబరులోనే బాబీ దర్శకత్వంలో సినిమాను పట్టాలెక్కిస్తారని సమాచారం. ఇప్పటికే బాబీతోపాటు, మెహర్‌ రమేశ్.. చిరు కోసం కథలు సిద్ధం చేసుకుని ఎదురు చూస్తున్నారు. బాబీ దర్శకత్వం వహించనున్న సినిమాలో చిరుతో పాటు, మరో అగ్రహీరో నటించనున్నారట. ప్రస్తుతం ఆ కథానాయకుడి ఎంపికపైనే కసరత్తులు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details