తన తల్లి పుట్టిన రోజు సందర్భంగా అగ్ర కథానాయకుడు చిరంజీవి అరుదైన ఫొటోలతో కూడిన వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా తన తల్లికి శుభాకాంక్షలు చెప్పారు.
మంచు విష్ణు, ఆయన సతీమణి వెరోనికా ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా జగన్, ఆయన సతీమణి భారతితో కలిసి దిగిన సెల్ఫీని వెరోనికా పంచుకున్నారు. అందరూ కలిసి భోజనం చేసినట్లు చెప్పారు.
యువ కథానాయకుడు అఖిల్ విహారయాత్రలో ఉన్నారు. ఈ సందర్భంగా సముద్రంలో షికారు వెళ్లిన ఫొటోను పంచుకుంటూ డాల్ఫిన్లను తనతో ఫొటో దిగేందుకు రమ్మంటూ క్యాప్షన్ ఇచ్చారు.