తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'పుష్ప' సినిమా చూసిన చిరు.. సుకుమార్​పై ప్రశంసలు - nagashourya lakshya OTT release date

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో 'పుష్ప' వీక్షించిన మెగాస్టార్, అఖిల్ బాడీ, 'లక్ష్య' ఓటీటీ రిలీజ్ డేట్​ గురించిన సంగతులు ఉన్నాయి.

chiranjeevi sukumar
చిరంజీవితో సుకుమార్

By

Published : Dec 27, 2021, 3:07 PM IST

Updated : Dec 27, 2021, 4:03 PM IST

Chiranjeevi pushpa movie: మెగాస్టార్ చిరంజీవి.. 'పుష్ప' మూవీ చూశారు. అనంతరం దర్శకుడు సుకుమార్​ను కలిసి, సినిమాపై ప్రశంసలు కురిపించారు. అద్భుతంగా తీశావంటూ మెచ్చుకున్నారు.

సుకుమార్ చిరంజీవి సెల్ఫీ

శేషాచలం ఎర్రచందనం నేపథ్యంగా తీసిన 'పుష్ప' సినిమాలో అల్లుఅర్జున్, రష్మిక హీరోహీరోయిన్లుగా నటించారు. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలకపాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. సుకుమార్ దర్శకత్వం వహించారు. మైత్రీమూవీ మేకర్స్ భారీ బడ్జెట్​తో నిర్మించింది.

Akhil akkineni: హీరో అక్కినేని అఖిల్.. తన బాడీ ట్రాన్స్​పర్మేషన్​తో అభిమానులను ఆశ్చర్యపరిచారు. కండల తిరిగిన తన బాడీ ఫొటోను సోమవారం సోషల్​ మీడియాలో పోస్ట్ చేయగా.. అభిమానులు వావ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

అఖిల్ కొత్త ఫొటో

ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'ఏజెంట్' సినిమా చేస్తున్నారు అఖిల్. ఇందుకోసమే ఈ బాడీ బిల్డింగ్ చేశారు. ఈ చిత్రంలో వైద్యసాక్షి హీరోయిన్​గా నటించింది. వచ్చే ఏడాది థియేటర్లలోకి రానుందీ సినిమా.

*నాగశౌర్య 'లక్ష్య' ఓటీటీ రిలీజ్​కు సిద్ధమైంది. జనవరి 7 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఆర్చరీ కథతో తెరకెక్కిన ఈ సినిమాలో కేతిక శర్మ హీరోయిన్​గా చేసింది. జగపతిబాబు కీలకపాత్ర పోషించారు. సంతోష్ దర్శకత్వం వహించారు.

నాగశౌర్య లక్ష్య ఓటీటీ రిలీజ్ డేట్

ఇవీ చదవండి:

Last Updated : Dec 27, 2021, 4:03 PM IST

ABOUT THE AUTHOR

...view details