తెలంగాణ

telangana

ETV Bharat / sitara

డోలీ మోసిన వారికి చిరంజీవి నమస్కారం - chiranjeevi news

Chiranjeevi kerala: కేరళలో ప్రస్తుతం ఉన్న చిరు.. ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తున్నారు. ఆదివారం, శబరిమల వెళ్లిన ఆయన.. గురువాయూర్ దేవాలయాన్ని సోమవారం దర్శించారు.

chiranjeevi visit kerala temples
చిరంజీవి కేరళ టెంపుల్స్

By

Published : Feb 14, 2022, 1:33 PM IST

ఇటీవల కరోనా నుంచి కోలుకున్న అగ్రకథానాయకుడు మెగాస్టార్‌ చిరంజీవి.. ప్రస్తుతం ఆధ్మాత్మిక యాత్రలో నిమగ్నమయ్యారు. తన సతీమణి సురేఖతో కలిసి కేరళలోని పలు దేవాలయాలను సందర్శిస్తున్నారు. ఆదివారం ఉదయం తనకెంతో ఇష్టమైన శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లారు. దేవాలయం వద్ద భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న కారణంగా ఆయన డోలీలో ప్రయాణించారు. గమ్యస్థానానికి చేరిన వెంటనే తన డోలీని మోసిన శ్రామికులకు చేతులెత్తి నమస్కరించారు. శబరిమల దర్శనానికి సంబంధించిన ఫొటోలను ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు.

కేరళలో చిరంజీవి దంపతులు

"చాలా సంవత్సరాల తర్వాత శబరిమలలో దర్శనం చేసుకొన్నాను. భక్తుల రద్దీ, అభిమానుల తాకిడి ఎక్కువగా ఉన్న కారణంగా అందర్నీ అసౌకర్యానికి గురి చేయకుండా డోలీలో వెళ్లాల్సి వచ్చింది. ఆ స్వామి పుణ్య దర్శనానికి వస్తున్న భక్తుల కోసం తమ శ్రమ ధారపోస్తున్న ఆ శ్రామిక సోదరులకు నా హృదయాంజలి" అని చిరు తెలిపారు.

కేరళలో చిరంజీవి దంపతులు

చిరంజీవి-సురేఖ దంపతులు సోమవారం ఉదయం గురువాయూర్‌ శ్రీ కృష్ణ ఆలయంలో ప్రత్యేకపూజల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. మరోవైపు చిరంజీవి అయ్యప్పస్వామిని ఎక్కువ విశ్వసిస్తారనే విషయం తెలిసిందే. ఆయనతోపాటు ఆయన తనయుడు రామ్‌చరణ్‌ సైతం ప్రతి ఏడాది అయ్యప్ప మాల ధరిస్తారు.

కేరళలో చిరంజీవి దంపతులు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details