ఏప్రిల్ 9న విడుదల కానున్న పవన్‌కల్యాణ్ నటించిన 'వకీల్‌సాబ్' చిత్రాన్ని వీక్షించేందుకు అభిమానుల ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తాను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. తన తల్లి, కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం పవన్ సినిమాను చూడబోతున్నట్లు వెల్లడించారు.
వకీల్‌సాబ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా: చిరు - వకీల్‌సాబ్ చిరంజీవి
పవన్‌కల్యాణ్ 'వకీల్‌సాబ్' చిత్రాన్ని చూసేందుకు తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. శుక్రవారం తన తల్లి, కుటుంబసభ్యులతో కలిసి థియేటర్లో సినిమా చూడబోతున్నట్లు ట్వీట్ చేశారు.

వకీల్‌సాబ్
"చాలా కాలం తర్వాత పవన్‌ను వెండితెర మీద చూడటానికి మీలాగే నేనుకూడా ఎదురుచూస్తున్నాను. అమ్మ , కుటుంబ సభ్యులతో రేపు సాయంత్రం థియేటర్లో వకీల్‌సాబ్ చూస్తున్నాను" అని చిరు ట్వీట్ చేశారు. గతంలో పవన్‌తో కలిసి దిగిన ఓ ఫొటోను జత చేశారు. ఇది అభిమానులను ఆకట్టుకుంటోంది. త్వరలోనే చిరు.. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆచార్య' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
ఇదీ చూడండి:'వకీల్‌సాబ్'లో అకీరా నటించలేదు'