మెగాస్టార్ చిరంజీవి.. 'బీ పాజిటివ్' మ్యాగజైన్ కోసం కోడలు ఉపాసనకు ఇటీవలే ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో తన ఆరోగ్య రహస్యానికి సంబంధించిన ఓ విషయాన్ని పంచుకున్నాడు.
"కేవలం చిత్ర పరిశ్రమలోనే కాదు, బయట వ్యక్తులు ఎవరైనా నా దృష్టిలో ఫిట్‌గా కనపడితే, వారిలా మారాలని అనుకుంటా. ప్రతి ఒక్కరి నుంచి స్ఫూర్తి పొందుతా. ముఖ్యంగా బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌ను చూస్తే భలే ముచ్చటేస్తుంది. ఆ వయసులోనూ ఆయన సెట్స్‌లో ఉత్సాహంగా ఉంటారు. నిర్మాత టి.సుబ్బరామిరెడ్డికి 77 ఏళ్లు, మురళీమోహన్‌కు 80 ఏళ్లు. వాళ్లందరూ శారీరకంగా, మానసికంగా చాలా దృఢంగా ఉంటారు. వారందరూ నాకు స్ఫూర్తే." -చిరంజీవి, కథానాయకుడు