'ఆచార్య' కోసం రంగంలోకి దిగబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇక నుంచి ఏకధాటిగా చిత్రీకరణ జరిగేలా ప్రణాళికలు రూపొందించినట్టు తెలుస్తోంది. ఆ మేరకు ఈ నెల 20 నుంచి చిరు.. డిసెంబరు 5 నుంచి హీరోయిన్ కాజల్ చిత్రీకరణకు హాజరు కానున్నారని సమాచారం. కరోనా ప్రభావంతో చిత్రీకరణలు ఆగిపోయాక చిరంజీవి మళ్లీ సెట్స్‌పైకి వెళ్లలేదు. ఇటీవలే చిత్రీకరణ పునః ప్రారంభమైంది.
'ఆచార్య' షూటింగ్లో పాల్గొనేందుకు రంగం సిద్ధం! - ఆచార్య షూటింగ్
ఈ నెల 20 నుంచి 'ఆచార్య' షూటింగ్లో మెగాస్టార్ చిరంజీవి పాల్గొననున్నారు. ఏకధాటిగా చిత్రీకరణలో పాల్గొని వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేయడమే లక్ష్యంగా ఈ చిత్రబృందం పనిచేస్తుందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

'ఆచార్య' షూటింగ్లో పాల్గొనేందుకు రంగం సిద్ధం!
అయితే కొవిడ్-19 పరీక్షలో చిరంజీవికి పాజిటివ్‌గా నిర్ధరణ కావడం వల్ల ఆయన కెమెరా ముందుకు వెళ్లలేకపోయారు. తనకు లక్షణాలేవీ లేకపోవడం వల్ల మరోమారు పరీక్షలు చేయించుకోగా అందులో నెగిటివ్‌గా తేలింది. దాంతో ఆయన ఇక కెమెరా ముందుకు వెళ్లేందుకు సన్నద్ధమయ్యారు. 'ఆచార్య'లో చిరుతోపాటు ఆయన తనయుడు రామ్‌చరణ్ కూడా నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు.