Tollywood heroes as Aghora: 'శంభో.. శివ శంభో.. హర హర స్వయంభో.. భం అఖండా..' అంటూ పాట వస్తుంటే 70 ఎంఎం స్క్రీన్‌పై బాలయ్య సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్కు అభిమానులు శివాలెత్తిపోయారు. బాలయ్య మాస్ డైలాగులకు తోడు ఆఘోరా ఆహార్యం తెప్పించిన ఊపు.. ఇప్పటికీ కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. అంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేశారు బాలయ్య.. అఘోరా గెటప్‌లో!
'అఘోరా' పాత్రల్లో స్టార్ హీరోలు.. తెలుగులో కొత్తేం కాదు! - విశ్వక్ సేన్
Tollywood heroes as Aghora: 'అఖండ' చిత్రంలో అఘోరాగా తెరపై బాలయ్య సృష్టించిన విధ్వంసాన్ని అభిమానులు ఇప్పుడప్పుడే మరచిపోలేరు. తమన్ అందించిన సంగీతానికి తోడు బాలయ్య డైలాగులతో థియేటర్లలో మాస్ జాతర జరుగుతోంది. వారిద్దరూ కలిసి ప్రేక్షకులను 'ఆఘోరా' ట్రాన్స్‌లోకి తీసుకెళ్లిపోయారు. అయితే బాలయ్య కన్నా ముందే తెలుగు తెరపై అఘోరా పాత్రల్లో.. మెగాస్టార్ చిరు, నాగార్జున, వెంకీలు నటించారని తెలుసా?
అఖండ
'అఖండ' సినిమా చూడటానికి ఏకంగా అఘోరాలే థియేటర్లకు వస్తున్నారంటే ఏ రేంజ్లో బాలయ్య విజృంభించారో అర్థం చేసుకోవచ్చు. అయితే తెలుగు తెరపై అఘోరాలు కొత్తేమి కాదు. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్ లాంటి పెద్ద హీరోలతో పాటు పలువురు నటులు అఘోరా పాత్రల్లో నటించి మెప్పించారు. అవి ఏయే సినిమాల్లో అంటే..
- 'శ్రీ మంజునాథ' సినిమాలో శివుడి పాత్రలో నటించారు మెగాస్టార్ చిరంజీవి. శివుడు భూమికి వచ్చే సందర్భంలో అఘోరా రూపంలో కనిపిస్తారు చిరు.
- 'ఢమరుకం'లో నాగార్జున సైతం కొద్దిసేపు అఘోరాగా కనిపించి మెప్పించారు.
- 'నాగవల్లి' సినిమాలో కొన్ని నిమిషాల పాటు అఘోరాగా కనిపిస్తారు వెంకటేశ్. రాజు అఘోరాగా మారడం ఇందులో కనిపిస్తుంది.
- 'అఘోర' అనే సినిమాలో టైటిల్లో కనిపించారు నటుడు నాగబాబు.
- ఇక అఘోరా పాత్రకు పూర్తి స్థాయిలో ఫేమ్ తీసుకొచ్చింది ఒక రకంగా సోనూసూద్ అని చెప్పాలి. 'అరుంధతి' చిత్రంలో సోనూ పోషించిన పాత్రకు జనం హడలెత్తిపోయారు. ఈ సినిమాతోనే అతడికి తెలుగులో బాగా పేరొచ్చింది.
- తమిళ హీరో ఆర్య.. నటించిన 'నేను దేవున్ని' సినిమాలో అఘోరా పాత్రలో జీవించాడని చెప్పాలి. బాల తెరకెక్కించిన ఈ చిత్రం కోసం నిజమైన అఘోరాలతో కొన్ని రోజులు ట్రావెల్ చేశాడు ఆర్య.
- మంచు మనోజ్ త్వరలో 'అహం బ్రహ్మస్మి' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాలో అతడు అఘోరాగా కనిపిస్తాడని సమాచారం.
- యువ నటుడు విశ్వక్ సేన్ కూడా అఘోరాగా అలరించనున్నాడు. ఆయన నటిస్తున్న 'గామి' చిత్రంలోని అఘోరా లుక్ ఇప్పటికే ఆకట్టుకుంటోంది.
ఇదీ చూడండి:అఖండ 'మాస్ జాతర' కాదు.. అంతకుమించి.. ఇవే సాక్ష్యాలు!