మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'సైరా నరసింహారెడ్డి' కొత్త పోస్టర్లు వచ్చాయి. వాటిని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు చిరు. మరో రెండు రోజుల్లో టీజర్‌ను విడుదల చేయనున్నారు. దీనికి పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ గాత్రాన్ని అందిస్తున్నాడు. అతడు డబ్బింగ్ స్టూడియోలో ఉన్న ఫొటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
'సైరా' కొత్త పోస్టర్లు.. రెండు రోజుల్లో టీజర్ - సైరా టీజర్
ఈనెల 20న మెగాస్టార్ నటించిన 'సైరా' టీజర్ రానుందని వెల్లడిస్తూ కొత్త పోస్టర్లు విడుదల చేసింది చిత్రబృందం. ఈ టీజర్‌కు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ గాత్రమందిస్తుండటం విశేషం.
'సైరా' కొత్త పోస్టర్లు.. రెండు రోజుల్లో టీజర్
'సైరా'లో భారీ తారాగణం నటించింది. అమితాబ్ బచ్చన్, కిచ్చా సుదీప్, నయనతార, విజయ్ సేతుపతి, తమన్నా, జగపతిబాబు, మెగా డాటర్ నిహారిక తదితరులు వివిధ పాత్రల్లో కనిపించనున్నారు. అమిత్ త్రివేది సంగీతమందించాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ నిర్మాత. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబరు 2న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
ఇది చదవండి: నాన్న మాటలు.. ఇండస్ట్రీ వైపు 'చిరు' అడుగులు
Last Updated : Sep 27, 2019, 9:26 AM IST