తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'శ్రీకారం'.. గొప్ప సందేశమిచ్చే చిత్రం: చిరు - చిరంజీవి వార్తలు

హీరో శర్వానంద్​ తనకు మరో రామ్​చరణ్​ లాంటి వాడని మెగాస్టార్​ చిరంజీవి అన్నారు. శర్వా నటించిన 'శ్రీకారం' సినిమా ప్రీ-రిలీజ్​ ఈవెంట్​లో పాల్గొన్న చిరు.. వ్యవసాయం గొప్పదనాన్ని చెప్పేందుకు సరైన సమయంలో సినిమా విడుదలవుతుందని ఆయన అన్నారు.

chiranjeevi speech at sreekaram movie pre-release event
'శ్రీకారం'.. గొప్ప సందేశమిచ్చే చిత్రం: చిరు

By

Published : Mar 8, 2021, 10:12 PM IST

వ్యవసాయం గొప్పదనం అందరికీ చెప్పేందుకు.. సరైన సమయంలో వస్తున్న సినిమా 'శ్రీకారం' అని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. 'శ్రీకారం' ప్రీరిలీజ్‌ వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఈ విధంగా మాట్లాడారు.

'శ్రీకారం' సినిమా టికెట్​ రిలీజ్​ చేసిన మెగాస్టార్​ చిరంజీవి

"మాకు మరో రామ్‌చరణ్‌.. శర్వానంద్‌. మా ఇంట్లోవాడిగా మాతో కలిసిపోతాడు. అదే క్రమంలో ఒకసారి అతడితో ప్రకటనలో చేయించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత శంకర్‌దాదా ఎంబీబీఎస్‌లో కూడా చేశాడు. అలా అతడి నటనకు తిలకం దిద్దే అవకాశం నాకు వచ్చింది. 'శ్రీకారం'లో అద్భుతంగా నటించాడు. ఒక మంచి సందేశం ఇచ్చే సినిమా ఇది. డైరెక్టర్‌ కిషోర్‌ను అభినందించకుండా ఉండలేకపోతున్నా. వ్యవసాయం ఎంత గొప్పదో చెప్పే ప్రయత్నమే ఈ 'శ్రీకారం'. రావాల్సిన సమయంలోనే ఈ సినిమా వచ్చిందని భావిస్తున్నా. సినిమాకు అందరూ ఎంతో మనసు పెట్టి పని చేశారు. కమర్షియల్‌ అందాలను జోడించి తీర్చిదిద్దిన మంచి చిత్రం ఇది. చివరగా నా బిడ్డ శర్వానంద్‌కు ఆల్‌ ది బెస్ట్‌."

- మెగాస్టార్​ చిరంజీవి, కథానాయకుడు

శర్వానంద్ హీరోగా కిశోర్‌ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ప్రియాంక అరుళ్‌ మోహన్‌ కథానాయిక. 14 రీల్స్‌ ప్లస్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు. మిక్కీ జె.మేయర్‌ స్వరాలు సమకూర్చిన ఈ చిత్రం శివరాత్రి కానుకగా మార్చి 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం ఖమ్మంలో ప్రిరిలీజ్‌ వేడుక ఏర్పాటు చేసింది.

ఇదీ చూడండి:సూపర్​స్టార్​ కటౌట్​కు నాగచైతన్య పాలాభిషేకం!

ABOUT THE AUTHOR

...view details