మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఖైదీ' ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతటి విజయం తర్వాత రాబోయే మరో చిత్రం కూడా అదే స్థాయిలో హిట్ అవుతుందని భావించారట చిరు. అదే 'వేట'. కానీ ఫలితం తారుమారైంది. దాంతో బాగా ఏడ్చేశానని ఇటీవలే ఓ కార్యక్రమంలో తెలిపారు మెగాస్టార్.
"వేట' విడుదలయ్యాక బాగా ఏడ్చేశా. 'ఖైదీ' తర్వాత విడుదలైన చిత్రం కావడం వల్ల 'వేట'పై ఎన్నో ఆశలు పెట్టుకున్నా. కాకపోతే ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. దాంతో ఇంట్లో కూర్చొని బాధపడ్డా."