టాలీవుడ్ అగ్రకథానాయకుడు బాలకృష్ణకు.. తన 60వ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే అగ్రహీరో చిరంజీవి ట్విట్టర్ ద్వారా ఆయనకు విషెస్ తెలిపారు. ఇదే ఉత్సాహంతో నిండు నూరేళ్ల సంబరం బాలయ్య జరుపుకోవాలని, అందరి అభిమానం ఇలాగే పొందాలని కోరుకుంటున్నట్లు రాసుకొచ్చారు.
"60లో అడుగుపెడుతోన్న మా బాలకృష్ణకు షష్టి పూర్తి శుభాకాంక్షలు. ఇదే ఉత్సాహంతో, ఉత్తేజంతో ఆయురారోగ్యాలతో నిండునూరేళ్ల సంబరం కూడా జరుపుకోవాలని, అందరి అభిమానం ఇలాగే పొందాలని కోరుకుంటున్నాను."