కరోనా మహమ్మారిని జయించిన వారు ప్లాస్మా దానానికి ముందుకు రావాలని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి విజ్ఞప్తి చేశారు. ప్లాస్మాను దానం చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరారు. శనివారం ఆయన ఈమేరకు ట్వీట్ చేశారు. యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాతో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల్లో ఇంతకంటే గొప్ప మానవత్వం ఇంకేముంటుందని పేర్కొన్నారు. కరోనా వారియర్లు ఇప్పుడు ప్రాణ రక్షకులు కావాలని చిరు ఆకాంక్షించారు.
ప్లాస్మా దానం చేసి ప్రాణాలు కాపాడండి: చిరు - చిరంజీవి ప్లాస్మా దాతలు
కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానానికి ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు మెగాస్టార్ చిరంజీవి. కరోనా వారియర్లు ఇప్పుడు ప్రాణ రక్షకులు కావాలని ఆకాంక్షించారు.
ప్లాస్మా దానం చేసి ప్రాణాలు కాపాడండి: చిరు
కరోనా మహమ్మారి లక్షణాల నుంచి కోలుకున్న ప్రతిఒక్కరూ ప్లాస్మా దానానికి ముందుకు రావాలంటూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఇచ్చిన పిలుపుపై చిరంజీవి ఈ విధంగా స్పందించారు. ఈ మేరకు సజ్జనార్ మాటలతో కూడిన ఓ వీడియోను తన ట్వీట్‌కు జత చేశారు.