శంషాబాద్ పశు వైద్యురాలి అత్యాచార ఘటనపై మెగాస్టార్ చిరంజీవి స్పందిచాడు. ఈ ఘటన తన మనసును కలచివేసిందని, ఇలాంటి మగమృగాల మధ్యా మన ఆడవాళ్లు బతికేది? అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.
"గత రెండు మూడు రోజులుగా ఆడపిల్లల మీద జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు చూస్తుంటే గుండె తరుక్కు పోతోంది. ఈ దేశంలో ఆడపిల్లలకు భద్రత లేదనే భావం కలుగుతోంది. మగమృగాల మధ్యా మనం బతుకుతోంది.. అనిపిస్తోంది. మనసు కలచివేసిన ఈ సంఘటనల గురించి ఒక అన్నగా, ఓ తండ్రిగా స్పందిస్తున్నాను. ఇలాంటి నేరాలు చేసిన దుర్మార్గులకు శిక్షలు చాలా కఠినంగా ఉండాలి. భయం కలిగించేలా ఉండాలి. నడిరోడ్డుపై ఉరితీసినా తప్పు లేదు. త్వరగా నేరస్థులను పట్టుకోవడం అభినందనీయమే. అలాగే త్వరితగతిన శిక్ష పడేలా చూడాలి. అప్పుడే ఇలాంటి నేరాలు చేయాలంటే ఎవరైనా భయపడతారు." -చిరంజీవి