తెలంగాణ

telangana

ETV Bharat / sitara

''నారప్ప' ఓ అద్భుతం'.. వెంకీకి చిరు ప్రశంస - నారప్పకు చిరు ప్రశంస

విక్టరీ వెంకటేశ్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'నారప్ప'. ఇటీవలే అమెజాన్ ప్రైమ్​ వేదికగా విడుదలైంది. తాజాగా ఈ సినిమాను వీక్షించిన మెగాస్టార్ చిరంజీవి.. వెంకీ పర్ఫామెన్స్​పై ప్రశంసల జల్లు కురిపించారు.

Chiranjeevi
చిరంజీవి

By

Published : Jul 23, 2021, 9:06 PM IST

విక్టరీ వెంకటేశ్, ప్రియమణి ప్రధానపాత్రల్లో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'నారప్ప'. ఇటీవలే అమెజాన్ ప్రైమ్​లో విడుదలైంది. తమిళంలో ధనుష్ నటించిన 'అసురన్'​కు రీమేక్​గా రూపొందిన ఈ సినిమా ఇక్కడా మంచి ప్రేక్షకాదరణ దక్కించుకుంది. ఇప్పటికే 'నారప్ప' చూసిన వారు వెంకీ పర్ఫామెన్స్​ను మెచ్చుకుంటూ సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు పెడుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి 'నారప్ప'ను వీక్షించిన తర్వాత వెంకీమామకు ఓ ఆడియో సందేశం పంపారు. దీనిని వెంకటేశ్ సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్తా వైరల్​గా మారింది.

"కంగ్రాట్యూలేషన్స్. ఇప్పుడే 'నారప్ప' చూశా. వావ్ వాట్ ఏ పర్ఫామెన్స్. వాట్ ఏ ట్రాన్స్​ఫర్మేషన్. ఎక్కడా వెంకటేశ్ కనపడలేదు. నారప్పే కనిపించాడు. పూర్తిగా కొత్త వెంకటేశ్​ను చూస్తున్నాను. క్యారెక్టర్​ను ఎంతో బాగా అర్థం చేసుకుని నటించావు. నీలోని నటుడు ఎప్పుడూ ఓ తపన, తాపత్రయంతో ఉంటాడు. అలాంటి వాటికి ఈ సినిమా ఓ మంచి ఉదాహరణ. మీకు మంచి సంతృప్తినిచ్చే సినిమా. అద్భుతమైన టీమ్ వర్క్. 'నారప్ప' మీకు మంచి చిత్రంతో పాటు మీ కెరీర్​లో గర్వించదగ్గ సినిమా అవుతుంది. మీకు, మీ టీమ్​కు అభినందనలు."

-చిరంజీవి, నటుడు

'నారప్ప' వెంకటేశ్‌ వన్‌మెన్‌ షో అని చెప్పవచ్చు. రెండు వైవిధ్యమైన పాత్రల్లో ఆయన నటన మెప్పిస్తుంది. ముఖ్యంగా ఎమోషనల్‌ సన్నివేశాల్లో నటుడిగా ఆయన సీనియార్టీ కనిపిస్తుంది. ఇక యాక్షన్‌ సన్నివేశాల్లో వెంకీమామ అదరగొట్టారు. ప్రియమణి, కార్తీక్‌రత్నం, రాజీవ్‌ కనకాల, రావు రమేశ్‌ తదితరులు తమ పాత్రల్లో మెప్పించారు. మణిశర్మ సంగీతం, శ్యామ్‌ కె.నాయుడు సినిమాటోగ్రఫీ బాగున్నాయి.

ఇవీ చూడండి: 'నారప్ప' సినిమా ఎలా ఉందంటే..

ABOUT THE AUTHOR

...view details