చిత్రలహరిపై మెగాస్టార్ ప్రశంసల జల్లు - చిత్రలహరి సినిమా
సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన సినిమా 'చిత్రలహరి'. ఈ చిత్ర బృందంపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. చాలా చక్కటి చిత్రం తీశావంటూ దర్శకుడ్ని అభినందించారు.
చిత్రలహరిపై మెగాస్టార్ ప్రశంసల జల్లు
ఇటీవలే విడుదలైన చిత్రలహరి సినిమాపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల జల్లు కురిపించారు. కిశోర్ తిరుమల మంచి దర్శకత్వ ప్రతిభ కనబరిచాడని చెప్పారు. హీరోగా నటించిన తేజ్ పరిణితి చెందిన నటనతో ఆకట్టుకున్నాడని తెలిపారు. సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్ మరోసారి మైమరిపించాడన్నారు. ఓ చక్కటి సందేశాత్మక చిత్రాన్ని అందించారని నిర్మాతలను ప్రశంసించారు.