'ఆచార్య'లోని మెగాస్టార్ చిరంజీవి పాత్ర.. ప్రేక్షకులపై ప్రభావం చూపిస్తుందని అంటున్నారు దర్శకుడు కొరటాల శివ. ఆయన దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే 40 శాతానికి పైగా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా నిలిచిపోయింది. అయితే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కొరటాల.. చిత్ర విశేషాలను పంచుకున్నారు.
''ఆచార్య'లో చిరు పాత్ర.. మీపై ప్రభావం చూపిస్తుంది'
అగ్రకథానాయకుడు చిరంజీవితో తీస్తున్న 'ఆచార్య' గురించి మాట్లాడారు దర్శకుడు కొరటాల శివ. తన స్టైల్‌తో పాటు చిరు ఇమేజ్‌కు తగ్గ కథతో సినిమా తీయనున్నట్లు తెలిపారు.
తను స్టైల్‌కు తగ్గట్లు సామాజిక అంశం, వినోదం... చిరు మాస్ ఇమేజ్‌కు సరితూగేలా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు చెప్పారు కొరటాల. మెగాస్టార్ నటిస్తున్న పవర్ఫుల్ పాత్ర, ప్రేక్షకులపై తప్పకుండా ప్రభావం చూపుతుందని అన్నారు.
ఇందులో నక్స్‌లైట్ నుంచి ప్రొఫెసర్‌గా మారిన పాత్రలో కనిపించనున్నారు చిరంజీవి. యువహీరో రామ్‌చరణ్ ప్రత్యేక పాత్ర పోషించనున్నాడు. కాజల్ హీరోయిన్. మణిశర్మ సంగీతమందిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.