నందమూరి హీరో బాలకృష్ణ-దర్శకుడు బోయపాటి కాంబోలో సినిమా అంటే ఏ రేంజ్లో ఉంటుందనేది 'అఖండ' సినిమాతో మరోసారి రుజువైంది. ఈ చిత్రం ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలోనే.. బోయపాటి-మెగాస్టార్ చిరంజీవి కాంబోలో మూవీ వస్తే?.. ఎలా ఉంటుందో అని మాట్లాడుకోవడం ప్రారంభించేశారు అభిమానులు. ఎందుకంటే 'అఖండ' సినిమా విజయంతో తానేంటో మరోసారి నిరూపించుకున్నారు బోయపాటి. దీంతో ఆయనతో సినిమా చేయాలని చిరంజీవి నిర్ణయించుకున్నారట! ఇప్పటికే వీరిద్దరి మధ్య చర్చలు కూడా జరిగాయని తెలుస్తోంది. ఓ మంచి స్క్పిప్ట్తో రావాలని బోయపాటిని చిరు అడిగారట.
ప్రస్తుతం 'అఖండ' విజయంతో ఆనందంలో ఉన్న బోయపాటి.. త్వరలోనే ఓ మంచి కథను తయారుచేసి చిరును సంప్రదించేందుకు సిద్ధమవుతున్నారట! ఈ స్క్రిప్ట్ చిరుకు నచ్చితే అధికారికంగా ప్రకటించి సెట్స్‌పైకి సినిమాను తీసుకెళ్తారు.