తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మాస్​ లుక్​లో చిరు​.. బాబీతో సినిమా షురూ - దర్శకుడు బాబీ

అగ్రకథానాయకుడు చిరంజీవి(chiranjeevi bobby film) నటించనున్న కొత్త సినిమా #MEGA154(వర్కింగ్​ టైటిల్​) షూటింగ్​ లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా చిరు మాస్​లుక్​ను విడుదల చేసింది చిత్రబృందం.

chiru
చిరు

By

Published : Nov 6, 2021, 12:11 PM IST

Updated : Nov 6, 2021, 2:55 PM IST

బాబీ దర్శకత్వంలో మెగాస్టార్​ చిరంజీవి(chiranjeevi bobby movie) హీరోగా #MEGA154 వర్కింగ్ టైటిల్​తో తెరకెక్కనున్న చిత్రం సెట్స్​పైకి వెళ్లింది. శనివారం పూజాకార్యక్రమాలతో ఈ సినిమా షూటింగ్​ లాంఛనంగా ప్రారంభమైంది(chiranjeevi bobby). ఈ సందర్భంగా ఈ సినిమాలోని చిరు మాస్​లుక్​ను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో రఫ్ లుక్​తో ఫ్యాన్స్​ను ఆకట్టుకున్నారు చిరు. స్టైల్​గా సిగరెట్​ వెలిగిస్తూ కనిపించి అలరించారు. మైత్రీ మూవీ మేకర్స్​ భారీ బడ్జెట్​తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దేవీశ్రీ ప్రసాద్​ సంగీతమందిస్తున్నారు. మాస్‌ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో చిరు మత్స్యకారుడిగా మాస్‌ గెటప్‌లో కనిపించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

చిరంజీవి కొత్త సినిమా ప్రారంభోత్సవ వీడియో

త్వరలోనే చిరు(chiranjeevi acharya movie).. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆచార్య' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దీంతో పాటే 'గాడ్​ఫాదర్'​, 'భోళాశంకర్'​ చిత్రాలతోనూ బిజీగా ఉన్నారు.

"మెగాస్టార్.. ఆయన పేరు వింటే.. అంతు లేని ఉత్సాహం! ఆయన పోస్టర్ చూస్తే.. అర్థం కాని ఆరాటం ! తెర మీద ఆయన కనబడితే... ఒళ్లు తెలియని పూనకం! పద్దెనిమిదేళ్ల క్రితం.. ఆయన్ని మొదటి సారి కలిసిన రోజు కన్నకల.. నిజమవుతున్న ఈ వేళ మీ అందరి ఆశీస్సులు కోరుకుంటున్నాను" అంటూ ప్రాజెక్ట్‌ ఆరంభంపై బాబీ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: కామెడీగా 'స్కైల్యాబ్​' ట్రైలర్​.. సాంగ్​తో 'శ్యామ్​ సింగ్​రాయ్'

Last Updated : Nov 6, 2021, 2:55 PM IST

ABOUT THE AUTHOR

...view details