తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'లూసిఫర్' రీమేక్​కు దర్శకుడు మారుతున్నాడా! - chiranjeevi vv vinaayk

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. తర్వాత 'లూసిఫర్' రీమేక్​లో నటించనున్నారు. ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహించాల్సి ఉంది. అయితే తాజాగా ఈ ప్రాజెక్టు కోసం మరో దర్శకుడిని సంప్రదించే యోచనలో ఉన్నారట చిరు.

లూసిఫర్ రీమేక్​కు దర్శకుడు మారుతున్నాడా!
లూసిఫర్ రీమేక్​కు దర్శకుడు మారుతున్నాడా!

By

Published : Jul 18, 2020, 8:27 PM IST

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి.. కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. అది పూర్తయిన తర్వాత 'లూసిఫర్' రీమేక్​లో నటించనున్నారు. ఈ సినిమాకు 'సాహో' ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహించబోతున్నాడు. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.

'లూసిఫర్'​ రీమేక్​ కథను తెలుగు ప్రేక్షకులను నచ్చే విధంగా తయారు చేసే పనిలో నిమగ్నమయ్యాడు సుజీత్. అయితే ఈ స్టోరీ మెగాస్టార్​కు అంతగా నచ్చలేదని తెలుస్తోంది. అందుకే ఈ ప్రాజెక్టును వేరే దర్శకుడితో పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యారట చిరు. చిరుతో 'ఠాగూర్', 'ఖైదీ నెంబర్ 150' తెరకెక్కించిన వి.వి వినాయక్​ను ఈ ప్రాజెక్టు కోసం తీసుకోబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజమెంతన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

ABOUT THE AUTHOR

...view details