'సైరా నరసింహారెడ్డి' సినిమా తర్వాత మెగాస్టార్ ఎవరి దర్శకత్వంలో నటిస్తారా అని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. చిరంజీవి తదుపరి చిత్రం కొరటాల శివతో చేస్తారని స్పష్టత వచ్చేసింది. ఈ నెలలోనే షూటింగ్ ప్రారంభం కానుందని చిత్రబృందం తెలిపింది. అప్పటిలోగా కథానాయిక, ఇతర సాంకేతిక నిపుణుల ఎంపిక జరగనుంది. త్వరలోనే వారి పేర్లు అధికారికంగా ప్రకటిస్తారు.
'సైరా' తర్వాత చిరంజీవి చిత్రం ఇదే - koratala shiva
మెగాస్టార్ అభిమానులకు శుభవార్త. 'సైరా' తర్వాత కొరటాల శివతో చిరంజీవి ఓ సినిమా చేయనున్నాడు. ఈ నెలలోనే లాంఛనంగా ప్రారంభం కానుంది.
చిరంజీవి, కొరటాల
బలమైన సామాజిక నేపథ్యంతో సాగే కమర్షియల్ సినిమాలు తీయడం కొరటాల శివ ప్రత్యేకత. ఈసారీ అదే పంథాలో కథ సిద్ధం చేశారట. స్క్రిప్టు పనులు దాదాపు పూర్తయ్యాయి. మిగిలిన వివరాలు త్వరలో వెల్లడిస్తారు. కొణిదెల ప్రొడక్షన్స్, మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఇవీ చూడండి.. 83' కోసం రణ్వీర్ ప్రాక్టీస్ షురూ
Last Updated : Apr 5, 2019, 10:04 AM IST