'సైరా' ఇచ్చిన విజయంతో ఫుల్‌జోష్‌లో ఉన్నాడు మెగాస్టార్ చిరంజీవి. తనలోని గ్రేస్ ఇంకా తగ్గలేదని నిరూపిస్తూ, బాక్సాఫీస్ రికార్డులు కొల్లగొడుతున్నాడు. ఈలోపే తన తర్వాత సినిమా మొదలుపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌సిటీలో వచ్చే నెలలో తొలి షెడ్యూల్ ప్రారంభం కానుంది. వరుసగా ఇరవై రోజుల పాటు కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.
చిరు తదుపరి సినిమాకు ముహుర్తం ఖరారు..! - చిరంజీవి తర్వాతి సినిమా
సైరా హిట్ టాక్ సంపాదించుకున్న తరుణంలో మరో సినిమాను పట్టాలెక్కించనున్నాడు చిరంజీవి. కొరటాల దర్శకత్వం వహించే ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానుందని సమాచారం.
మెగాస్టార్ చిరంజీవి
ఈ సినిమాలో హీరోయిన్గా కాజల్‌ను ఎంపిక చేయనున్నారని సమాచారం. కొరటాల శివ దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ ఫైనల్ వెర్షన్‌ను సిద్ధం చేస్తున్నాడీ డైరక్టర్.
ఇవీ చదవండి: