మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న సైరా నరసింహారెడ్డి షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఈ చిత్రం పూర్తవగానే కొరటాల శివ దర్శకత్వంలో నటించనున్నాడు మెగాస్టార్. ఇందులో రెండు పాత్రల్లో కనువిందు చేయనున్నట్లు సమాచారం.
నక్సలిజం నేపథ్యంతో తెరకెక్కనున్న ఈ సినిమాలో ఆచార్య అనే నక్సలైట్‌గా.. మరో పాత్రలో గోవింద్ అనే ఎన్నారైగా దర్శనమివ్వనున్నాడట చిరంజీవి. ఇందులో ఓ పాత్రలో స్లిమ్‌గా కనిపించడానికి అప్పుడే కసరత్తులూ ప్రారంభించాడట ఈ స్టార్ హీరో.