'ఆచార్య' షూటింగ్‌తో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి.. విహారయాత్రకు వెళ్లారు. తన మిత్రుడు, సీనియర్ కథానాయకుడు మోహన్‌బాబుతో కలిసి సిక్కింకు పయనమయ్యారు. వీరిద్దరూ ట్రిప్‌కు వెళ్లేందుకు తీసుకున్న ఫొటోను మోహన్‌బాబు కుమార్తె లక్ష్మి మంచు ట్వీట్ చేసింది.
"ఇద్దరు మేధావులు సిక్కిం ట్రిప్‌కు వెళ్తే ఎంత రచ్చ చేస్తారో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో నాకు కొంత ఈర్ష్యగానే ఉంది. మీ ఇద్దరికి సమయం దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది" అని లక్ష్మి రాసుకొచ్చింది.