మెగాస్టార్ చిరంజీవి(megastar chiranjeevi news)పై ఉన్న అభిమానాన్ని ప్రత్యేకంగా చాటుకున్నారు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన డెక్కల గంగాధర్. చిరంజీవి నటించిన 'మాస్టర్' సినిమా విడుదలై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చిరును కలిసేందుకు అక్టోబరు 3న ఆయన పాదయాత్ర చేపట్టారు. అమలాపురంలో ప్రారంభమైందీ యాత్ర. అలా గంగాధర్ కాలినడకన (సుమారు 726 కి.మీ.) హైదరాబాద్‌లోని 'చిరంజీవి బ్లడ్ బ్యాంకు'కు చేరుకున్నారు.
దివ్యాంగ అభిమాని పాదయాత్ర.. చలించిన చిరంజీవి - చిరంజీవి లేటెస్ట్ న్యూస్ట
మెగాస్టార్ చిరంజీవి(megastar chiranjeevi news)పై ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ తూర్పుగోదావరి నుంచి హైదరాబాద్‌కు నడుచుకుంటూ వచ్చారు గంగాధర్ అనే దివ్యాంగుడు. ఈ విషయం తెలుసుకున్న చిరు.. ఆయనను కలిసి కాసేపు మాట్లాడారు.
ఈ విషయం తెలుసుకుని చలించిపోయిన చిరంజీవి(megastar chiranjeevi news).. వెంటనే గంగాధర్‌ను తన ఇంటికి తీసుకెళ్లి, కాసేపు ముచ్చటించారు. గంగాధర్ దివ్యాంగుడు కావడం వల్ల "ఇలాంటి సాహసాలు ఎప్పుడూ చేయొద్దు" అని కోరారు. అనంతరం, గంగాధర్ ఆరోగ్య పరిస్థితి, కుటుంబ నేపథ్యం తదితర విషయాలు గురించి అడిగి తెలుసుకున్నారు.
"నా స్వగ్రామం ఉప్పలగుప్తం మండలంలోని కిత్తనచెరువు. చిరంజీవిగారంటే ఎంతో అభిమానం. అందుకే ఇన్ని వందల కిలోమీటర్లు నడిచివచ్చాను. ఆయన నుంచి ఏం ఆశించిరాలేదు. ఆయన్ను కలిస్తే చాలు అనుకుని వచ్చా. చిరంజీవి ఇచ్చిన ధైర్యం, ఆతిథ్యం మరిచిపోలేను. ఈ జీవితానికి ఇది చాలు" అని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు గంగాధర్.