తెలంగాణ

telangana

ETV Bharat / sitara

తమిళనాడు సీఎంతో చిరంజీవి భేటీ - Chiranjeevi Acharya movie

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్​ను కలిసి అభినందించారు మెగాస్టార్​ చిరంజీవి(Chiranjeevi stalin). ఆయన​ రాజనీతిజ్ఞుడిగా ఎదుగుతున్నారని చిరు ప్రశంసించారు.

chiru
చిరు

By

Published : Sep 1, 2021, 7:20 PM IST

మెగాస్టార్​ చిరంజీవి.. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను(Chiranjeevi stalin) కలిసి, కాసేపు ముచ్చటించారు. ఆయన​ రాజనీతిజ్ఞుడిగా ఎదుగుతున్నారని ప్రశంసించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ స్టాలిన్​తో పాటు ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్​తో కలిసి దిగిన ఫొటోను ట్వీట్​ చేశారు.

స్టాలిన్​, ఉదయనిధి స్టాలిన్​తో చిరంజీవి

"పార్టీలకు అతీతంగా స్టాలిన్‌ పథకాలు అందిస్తున్నారు. ఆయన దార్శనికత, అంకితభావం ఉన్న ప్రజానేత. కరోనా వేళ స్టాలిన్‌ ప్రభుత్వం సమర్థంగా వ్యవహరించింది" అని చిరు ప్రశంసించారు.

స్టాలిన్​తో చిరు

త్వరలోనే చిరు.. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆచార్య'(Chiranjeevi Acharya movie) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆ తర్వాత 'లూసిఫర్'​ రీమేక్​(గాడ్​ఫాదర్) ​'భోళా శంకర్', ​బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు.

ఇదీ చూడండి: chiranjeevi kapil dev: కపిల్​తో చిరు-ప్యాలెస్​లో సందడి

ABOUT THE AUTHOR

...view details